PM Modi: ‘‘చంద్రయాన్-2’’ విఫలమైన రోజు రాత్రి నిద్ర పోలేదు.. వెళ్లొద్దని చాలా మంది చెప్పారు..
- చంద్రయాన్-2 విఫలమైన రోజు నిద్ర పోలేకపోయాను..
- చాలా మంది వెళ్లొద్దని సలహా ఇచ్చారు..
- ఆనాటి క్షణాలను పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతీయ అంతరిక్ష విజయాల్లో ‘‘చంద్రయాన్’’ ప్రయోగానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్ల క్రితం చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు ‘‘చంద్రయాన్-2’’ ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది.
‘‘చంద్రయాన్-2’’ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. అయితే, విఫలమైన తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాననే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తన తొలి పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కి ప్రధాని మోడీ హాజరయ్యారు.
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..
చంద్రయాన్-2 ప్రయోగానికి హాజరుకావద్దని తనను చాలా మంది వారించారని చెప్పారు. ‘‘చాలా మంది నాకు చెప్పారు, సార్ మీరు అక్కడికి వెళ్లకూడదని. అలాంటి మిషన్ల చుట్టూ చాలా అనిశ్చితులు ఉంటాయి. చాలా దేశాలు తరచుగా 4-5 ప్రయత్నాల తర్వాత విజయం సాధిస్తాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది’’ అని చాలా మంది తనకు సలహా ఇచ్చారని మోడీ చెప్పారు. దీనిపై ‘‘తనకు ఎలాంటి బాధ్యత లేదా..?’’ అని అడిగానని ప్రధాని అన్నారు.
చంద్రయాన్-2 చివరి క్షణాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ విలఫమైంది. ‘‘ తనకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం రావడం లేదు. అయితే, ఏదో తప్పు జరిగిందని గ్రహించాను. అది పనిచేయడం లేదు’’ అని ప్రధాని అన్నారు. ‘‘చివరకు ఒక సీనియర్ సైంటిస్టు తన వద్దకు వచ్చారని, అతడితో చింతించకండి’’ అని చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఆ రాత్రి తాను నిద్రపోలేకపోయానని, తర్వాత రోజుఉదయం 7 గంటలకు శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
‘‘ఇది దేశానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ. కానీ నేను ఎదురుదెబ్బలకు ఏడ్చే వ్యక్తిని కాదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి చెప్పాను. ఏదైనా వైఫల్యం ఉంటే, నేను బాధ్యత తీసుకుంటానని అన్నాను. మీరు ఒక ప్రయత్నం చేశారు, నిరాశ చెందొద్దని చెప్పారు. ఆ తర్వాత చంద్రయాన్ -3 విజయవంతం కావడం మనకు తెలిసిందే’’ అని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!