Venu Goapl Reddy
Author- NTV Telugu-
Sanjay Raut: ప్రజాస్వామ్యానికి చౌకీదార్ ఇందిరా గాంధీ.. ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థించిన సంజయ్ రౌత్..
Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Mallikarjun Kharge: ‘‘మనకు దేశం ముందు, కొందరికి మోడీ ముందు’’.. శశిథరూర్‌పై కాంగ్రెస్ చీఫ్ విమర్శలు..
Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
Iran: కాల్పుల విరమణ మరుసటి రోజే.. “ఇజ్రాయిల్ గూఢచారులను” ఉరితీసిన ఇరాన్..
Iran: 12 రోజులు పాటు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణ నెలకొంది. ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని, టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హతమార్చింది. అయితే, దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. -
Pakistan: అభినందన్ వర్థమాన్‌ని పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ హతం..
Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు. -
Pakistan: అమెరికాకు ముప్పుగా పాకిస్తాన్.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది. -
Air India: ‘‘కుడి ఇంజన్ కొత్తది, ఎడమ ఇంజన్ తనిఖీ చేశాం’’.. ప్రమాదంపై ఎయిర్ ఇండియా..
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో వందలాది మంది మరణించడం దేశాన్ని కలిచివేసింది. లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ ఆయిన 36 క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 ప్రయాణికులలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. నేలపై ఉన్న వారిలో కలిపి 280 మంది వరకు మరణించారు. -
Russia: ఇజ్రాయిల్-ఇరాన్ వివాదంలో మీ జోక్యం వద్దు.. యూఎస్‌కి రష్యా వార్నింగ్..
Russia: ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో రష్యా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంలో యూఎస్ సైనిక జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. ‘‘ ఈ పరిస్థితిలో సైనిక జోక్యం ఉండకూడదు. ఇది నిజంగా అనూహ్యమైన, ప్రతికూల పరిణామాలతో కూడిన అత్యంత ప్రమాదకర చర్య అవుతుంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. -
Israel: సద్దాం హుస్సేన్ని మొసాద్ చంపాలనుకుంది.. కానీ, దారుణంగా విఫలమైన ఇజ్రాయిల్..
Israel: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెడున్నాయి. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య సంఘర్షణ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలను, ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, కీలక మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ దాడులు చేసింది. మరోవైపు, ఇరాన్ కూడా క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతోంది. -
Tamil Nadu: ‘‘మురుగన్ సదస్సు’’కు వెళ్లనున్న సీఎం యోగి, పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన డీఎంకే..
Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది. -
Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..
Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!