Ghaziabad: కస్టమర్లకు ఇచ్చే రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోటీలు తయారు చేసే సమయంలో ఓ వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. లోధి చౌక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక తినుబండారాల షాపులో పనిచేస్తున్న 20 ఏళ్ల ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Read Also: Couple Suicide: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య.. ఆ తర్వాత భార్య కూడా..
ఇర్ఫాన్ రోటీలను తందూర్‌లో ఉంచే ముందు వాటిపై ఉమ్మి వేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది గురువారం రోజున సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని బిజ్నోర్ జిల్లా ధాంపూర్‌లోని నాయి బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఖోడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇందిరాపురం ఏసీపీ అరెస్ట్‌ని ధ్రువీకరించారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో యూపీలోని బులంద్ షహర్‌లో కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్ అయింది. అంతకుముందు షామ్లి జిల్లాలో ఒక జ్యూస్ విక్రేత దానిలో ఉమ్మివేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జ్యూస్ విక్రేత ఆసిఫ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కస్టమర్లు తినే ఆహారంలో ఇలాంటి పనులు చేస్తు్న్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు యూపీ సర్కార్ 10 ఏళ్ల జైలు శిక్షను ప్రతిపాదించే ఆర్డినెన్స్ తీసుకురావాలని యోచిస్తోంది.
दिल्ली और नोएडा से सटे गाजियाबाद के खोड़ा से अब ढाबे पर ग्राहकों को थूक वाली रोटी परोसे जाने का वीडियो सामने आया है। पुलिस ने आरोपी को हिरासत में ले लिया है।#Ghaziabad #ViralVideo @CMOfficeUP@fooddeptgoi@ghaziabadpolice@dm_ghaziabad pic.twitter.com/Yceid8YlBj
— vivek kumar (@viveklkovivek) January 10, 2025