Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడి దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. మొత్తం 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం వెంటనే సైఫ్‌ని ఆస్పత్రికి తరలిండచంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ ఇంటికి ఉన్న ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా దుండగుడు ఇంటిలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే, ఈ పరిణామంపై విపక్షాలు అధికార బీజేపీ పార్టీపై ఫైర్ అవుతున్నాయి. ముంబై ప్రజలకు రక్షణ కరువైందని ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గురువారం బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘గుజరాత్ జైలులో కూర్చున్న గ్యాంగ్‌స్టర్ నిర్భయంగా వ్యవహరిస్తున్నాడు. అతనికి రక్షణ కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రస్తావించారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొన తొలగింపు!
‘‘ఇంత సురక్షితమైన ప్రదేశంలో నివసిస్తున్న అంత పెద్ద నటుడి ఇంట్లో దాడి జరగడం ఆందోళన కలిగించే విషయం. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. గతంలో, సల్మాన్ ఖాన్ పై దాడి జరిగింది, బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ప్రభుత్వం అంత పెద్ద సెలబ్రిటీలకు భద్రత కల్పించలేకపోతే, సామాన్యుల సంగతేంటి? డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను లేదా భద్రతను అందించదు’’ అని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రభుత్వం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దును కూడా రక్షించలేకపోయిందని, వారు రాజీనామా చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మురికి రాజకీయాలు ఆపేసి భద్రతన కల్పించే దిశగా పనిచేయాలని కేంద్రాన్ని కోరారు. అంతకుముందు ఈ రోజు కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను అని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 10 టీములతో వెతుకుతున్నారు.