Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,
Asaduddin Owaisi: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) త్వరలో అమలు చేయబోతున్నారు. అక్కడ పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ యూసీసీ అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే, దీనిపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ‘‘హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టాలకు మినహాయింపు ఇస్తునప్పుడు దీనిని యూనిఫాం సివిల్ కోడ్’’గా పిలువలేము అని అన్నారు.
Tamilisai: తమిళనాడు బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. మరో వర్గం తమ వ్యాధులను నయం చేయడానికి గోమూత్రం ఉపయోగిస్తారు. దీనిపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు..? ’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘తన తండ్రి జ్వరానికి గోమూత్రంతో చికిత్స చేస్తున్నానని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి వ్యాఖ్యానించారు’’. ఆయన వ్యాఖ్యలకు తమిళిసై మద్దతుగా నిలిచారు.
AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ రావణుడు బంగారు జింక రూపంలో వచ్చి సీతని అపహరించాడు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
Sanjay Raut: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స, ఇతర చికిత్స అనంతరం ఈ రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Read Also: Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే […]
Trump Tower: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తన తొలిరోజు రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా-ఇండియాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ భారత్‌కి సన్నిహితుడనే పేరుంది. మోడీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఇరు దేశాల కీలక ఒప్పందాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు.
Maoist Leader Chalapati: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం రాత్రి ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు చనిపోయారు.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్ తగిలింది. ఆప్‌కి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు బీజేపీలో చేరారు.
Sambhal violence: గతేడాది నవంబర్ 24న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో జరిగిన హింసత యావత్ దేశంలో సంచలనంగా మారింది. షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన బృందంపై అల్లరి మూకలు దాడి చేశాయి. మసీదు సర్వేకి అంతరాయం కలిగించేందుకు ఓ వర్గం రాళ్లదాడికి పాల్పడింది. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులుని యోగి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది.