Sambhal violence: గతేడాది నవంబర్ 24న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో జరిగిన హింసత యావత్ దేశంలో సంచలనంగా మారింది. షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన బృందంపై అల్లరి మూకలు దాడి చేశాయి. మసీదు సర్వేకి అంతరాయం కలిగించేందుకు ఓ వర్గం రాళ్లదాడికి పాల్పడింది. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులుని యోగి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ అల్లర్లో పాల్గొన్న మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఒకప్పటి హరిహర్ మందిరమని హిందూ పక్షం కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 24, 2024లో సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది.
Read Also: Hair care: ఈ మూడు రకాల నూనెలు జుట్టుకు పట్టిస్తే.. దృఢంగా మారడం ఖాయం?
వీరిలో ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఏఎస్పీ శ్రీ చంద్ర ఆదివారం తెలిపారు. అరెస్టు చేయబడిన వారిలో తొమ్మిది మంది అల్లర్ల సమయంలో పోలీసులపై రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, మరొకరు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ హింసాకాండలో అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిలాల్ అన్సారీ, అయాన్ అనే ఇద్దరు యువకులు అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో మరణించారని, గందరగోళ సమయంలో మరణించిన నలుగురిలో వీరు కూడా ఉన్నారని వెల్లడించారు.
ముల్లా అఫ్రోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరైన గ్యాంగ్‌స్టర్ షరీక్ సాతాతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. దుబాయ్ నుండి భారతదేశంలో తన ముఠా నెట్‌వర్క్‌ను నడుపుతున్న సాతాతో ఆఫ్రోజ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని పోలీసులు తెలిపారు. షరీక్ సాతా పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉన్నాడని, ISI తో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. సంభాల్‌కి చెందిన సతాపై యూపీ, ఢిల్లీలో 50కి పైగా కేసులు ఉన్నాయి. నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి కొన్నేళ్ల క్రితం దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి భారత నిఘా సంస్థలు ఇతడి కోసం వెతుకుతున్నాయి.