Donald Trump: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు, టెక్-వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. ప్రమాణస్వీకారం ముందు రోజు వాషింగ్టన్లో ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన 100 మంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల జాబితాలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉన్నారు.
Encounter: జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళలో ఆదివారం రోజు భారీ అగ్ని ప్రమాదం రిగింది. సెక్టార్-19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో రెండు నుండి మూడు గ్యాస్ సిలిండర్లు పేలిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తుల భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హాని జరగలేదు. పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు.
Ajit Pawar: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఇంట్లో దొంగతానికి వచ్చిన దుండగుడు సైఫ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ రోజు థానేలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Trump Trip To India: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విదేశీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన తొలిరోజు ఎలాంటి సంచలన ఆర్డర్స్‌పై సంతకాలు చేస్తారనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ భారతదేశ పర్యటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రేపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాజధాని వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్‌లో జరగబోతున్నాయి. చల్లని వాతావరణం కారణంగా ఇండోర్ వేదికలో కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలతో పాటు కీలకమైన రాజకీయ నాయకులు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు.
Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు పరుగులు తీశారు. అనేక అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్‌గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.
Mahakumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. కుంభమేళ ముగిసే నాటికి ఏకంగా 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి వస్తారని అంచనా. ఇటీవల ఇటలీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కుంభమేళలో ‘‘కాలభైరవాష్టకమ్’’ పాడటం వైరల్‌గా మారింది. హిందూ ధర్మంపై వారికి ఉన్న భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.