Maoist Leader Chalapati: మావోయిస్ట్ అగ్రనేత చలపతి హతం.. రూ. కోటి రివార్డ్.. ఎవరు ఇతను..?
- మావోయిస్టు అగ్రనేత చలపతి హతం..
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణం..
- ఏపీ చిత్తూర్ నుంచి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Leader Chalapati: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం రాత్రి ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మరణించారు. ఇతడి అసలు పేరు జయరాం రెడ్డి, రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే మారుపేర్లు కలిగి ఉన్నారు. ఇతడిపై ప్రభుత్వం రూ. 1 కోటి రివార్డు ప్రకటించింది. అనేక దాడుల్లో ఇతడి ప్రమేయం ఉంది. సల్వాజుడుం నేత మహేంద్ర కర్మని హతమార్చిన ఆపరేషన్‌లో చలపతి ప్రమేయం కీలకంగా ఉంది.
ప్రస్తుతం మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మాకి చలపతి గురువుగా భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి అత్యంత సన్నిహితుడు. చలపతి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018 లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యాకాండలో చలపతి కీలకంగా ఉన్నారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
Read Also: Donald Trump : ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే రూ.48 వేల కోట్ల నష్టం.. ఎక్కడంటే ?
జయరాం రెడ్డి అలియాస్ చలపతి ఎవరు..?
60 ఏళ్ల చలపతి ఆంధ్రప్రదేశ్ చిత్తూర్‌లోని మదనపల్లెకి చెందిన వారు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అతని విద్యా నేపథ్యం తక్కువగా ఉన్నప్పటికీ, మావోయిస్టు అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా చేరాడు. రూ. 1 కోటి రివార్డ్ ప్రకటించిందంటే చలపతి ప్రభుత్వానికి ఎంత ప్రాముఖ్యంగా మారాడో తెలుస్తోంది. చలపతికి బస్తర్ అడవుల గురించి అంతా తెలుసు. 8-10 మంది వ్యక్తగత గార్డులతో కూడిన భద్రతా సిబ్బంది చలపతిని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది.
దాడులకు వ్యూహాలు రూపొందించడంలో చలపతి దిట్ట. అబుజ్‌మడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎన్‌కౌంటర్లు పెరిగిన నేపథ్యం ఇటీవల చలపతి ఆయన స్థావరాన్ని గరియాబంద్-ఒడిశా సరిహద్దుకు మార్చారు.
ఎన్‌కౌంటర్:
చలపతి సహచరుల్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ , సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ కోబ్రా కమాండోలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌తో కూడిన దళాలు ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కులారి ఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆపరేషన్ నిర్వహించాయి. కొంతమంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌ని ‘‘అతిపెద్ద విజయం’’గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!