Manish Sisodia: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా వెళ్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీని ఏలిన ఆప్ ఘోర పరాజయం పాలవుతోంది. ముఖ్యంగా ఆప్ ప్రధాన నేతలంతా ఓటమి దారిలో ఉన్నారు. ప్రస్తుతం, 70 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Read Also: Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం.. ఆ పార్టీ ఘన విజయం..
ఇదిలా ఉంటే, ఆప్ టాప్ లీడర్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. జంగ్‌పురా నుంచి పోటీ చేసిన ఈయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలుపొందారు. 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లారనే సానుభూతి కూడా సిసోడియాను గట్టెక్కించలేకపోయింది. ఓటమిని మనీష్ సిసోడియా ఒప్పుకున్నారు. జంగ్‌పురా ప్రేమ, అనురాగం, సమానత్వాన్ని ఇచ్చిందని అన్నారు.
నియోజకవర్గం మారినప్పటికీ ఓటమి తప్పలేదు. మరోవైపు ఆప్ నేతలైన సోమనాథ్ భారతీ కూడా ఓడిపోయారు. సీఎం అతిశీ మార్లేనా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా పయనిస్తున్నారు.