Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఇంటర్నెట్‌లో మీమ్స్‌కి కారణమైంది. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పరిస్థితిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 46, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఇంటర్నెట్ యూజర్లు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
ఎక్స్‌లో ఓ నెటిజన్ కేజ్రీవాల్‌ని క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ, కోహ్లీ కన్నీరు పెట్టుకున్న ఫోటోని షేర్ చేశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ఓటమి దిశగా పయణిస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ లీడింగ్‌లో ఉన్నారు. మరో మీమ్‌లో కేజ్రీవాల్ ఏడుస్తున్న వీడియోని షేర్ చేశారు. ఇటీవల సమాజ్‌వాదీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ ఓ మీడియా కార్యక్రమంలో కంట తడి పెట్టారు. దీనిని కేజ్రీవాల్‌కి ఆపాదించారు.
Kejriwal right now : pic.twitter.com/rOoHm1lIlE
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) February 8, 2025
Arvind Kejriwal after seeing Delhi Election Result pic.twitter.com/IDQ128X577
— SarcasmHit (@SarcasmHit) February 8, 2025
Tough fight between AAP and BJP 🔥
Meanwhile, Rahul Gandhi for the 3rd time: pic.twitter.com/nChQgVvnHc
— Post-Truth🌹 (@PostTruthIndia) February 8, 2025
ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది. దీంతో రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ, సున్నాని చెక్ చేస్తున్న మీమ్ వైరల్ అయింది. మరోవైపు ఒకప్పటి ఆప్ నేత స్వాతి మలివాల్ కేజ్రీవాల్ ఓటమితో సంతోషంగా ఉన్నట్లు చూపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ పోరాడుతుంటే కాంగ్రెస్ సైలెంట్‌గా గేమ్ చూస్తున్న మీమ్ కూడా హాస్యాస్పదంగా ఉంది.
#DelhiElectionResults pic.twitter.com/gNZSeHDdYK
— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) February 8, 2025
#DelhiElectionResults pic.twitter.com/TuHLOUHVWW
— Desi Bhayo (@desi_bhayo88) February 8, 2025
#DelhiElectionResults pic.twitter.com/gNZSeHDdYK
— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) February 8, 2025