AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఆప్ ఘోర పరాజయం పొందింది. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాషాయ పార్టీ 48 సీట్లు గెలిస్తే, ఆప్ 22కే పరిమితమైంది. కాంగ్రెస్ అత్యంత దారుణంగా సున్నా స్థానాలకు పరిమితమై, 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆప్ తన ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ప్రధానంగా తమ ఓటమికి 3 కారణాలను ఆప్ నేతలు ప్రస్తావిస్తు్న్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
PM Modi US Visit: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీపై భారత్‌తో పాటు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ప్రధాని మోడీని అమెరికా సందర్శించమని ఆహ్వానించడం భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను చూపిస్తుంది.’’ అని అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్ […]
JP Morgan Chase: టెక్ సంస్థల్లో అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇలా ఉద్యోగుల ఉద్వాసనకు కారణమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ దిగ్గజాలతో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా, అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ JP మోర్గాన్ చేజ్ భారీగా ఉద్యోగుల లేఆఫ్స్‌కి ప్లాన్ సిద్ధం చేసింది. 2025 అంతా ఉద్యోగుల కోతలు ఉంటాయని ప్రకటించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
Tamil Nadu: పెరియార్ సిద్ధాంతం, కుల-మత రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కుల దురహంకారం, పరువు హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని మెలపిడావూర్ సమీపంలో దళిత విద్యార్థిపై అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతడి చేతులు నరికేశారు. ప్రభుత్వ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితుడు అయ్యసామి(20) బుధవారం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దాడికి గురయ్యాడు. Read Also: Titanic Submersible: సముద్రగర్భంలో […]
Titanic Submersible: సముద్ర గర్భంలో దాగున్న టైటానిక్ ఓడ శిథిలాలను చూడటానికి వెళ్లిన ‘‘టైటాన్ సబ్మెర్సిబుల్’’ విషాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. సముద్ర గర్భంలోకి వెళ్లిన కొద్ది నిమిషాల లోపే ఈ టైటాన్ క్యాప్సూ్ల్,సముద్ర నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఇంప్లోడ్ అయింది. 2023లో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Bihar: మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక, తరుచుగా ఇంటికి వచ్చే లోక్ రికవరీ ఏజెంట్‌ని ఓ మహిళ ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంద్ర కుమారికి 2022లో జముయి జిల్లా నివాసి నకుల్ శర్మతో విహహం జరిగింది. నకుల్ మద్యానికి బానిస కావడంతో, తరుచుగా భార్యని వేధించే వాడు. శారీరక, మానసిక వేధింపులు భరించలేక అతడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
Himanta Sarma: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్న ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోందని హిమంత శర్మ ఆరోపించారు. ప్రత్యక్షంగా ఎవరి పేరు చెప్పకుండా బుధవారం నుంచి వరసగా ఎక్స్‌లో ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్నారు. భారతదేశం అభ్యంతరం చెప్పినప్పటికీ 2015లో పాకిస్తాన్ హైకమిషనర్‌తో గౌరవ్ గొగోయ్ సమావేశం కావడాన్ని కూడా ఆయన విమర్శించారు.
Aaditya Thackeray: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడం ఇండియా కూటమిలో ప్రకంపనలకు కారణమైంది. దీనికి తోడు శివసేన ఏక్నాథ్ షిండేని, శరద్ పవార్ అవార్డుతో సత్కరించడం కూడా ప్రతిపక్ష కూటమిలో తీవ్ర విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రశ్నిస్తోంది.