China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌కి భద్రతా ముప్పు..
- మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్..
- భారత్‌కి భద్రతాపరమైన ఇబ్బందులు..
- మన క్షిపణుల్ని ట్రాక్ చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్సులో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌కి భద్రతాపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. భారత మిస్సైల్ ప్రోగ్రాం, జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ (LPAR) 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది. దీని ద్వారా చైనా హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలపై, భారత భూభాగాలను కూడా పర్యవేక్షించగలదు. ఈ అధునాతన రాడార్ వ్యవస్థ చైనా నిఘా సేకరణ సామర్థ్యాలను, ముఖ్యంగా ఇండియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కి సంబంధించి కన్నేసి ఉంచగలదు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: UltraTech: “అల్ట్రాటెక్” అంటే ఇకపై సిమెంట్ మాత్రమే కాదు..
ముందస్తు హెచ్చరికలు, నిఘా కోసం రూపొందించిన LPAR వ్యవస్థ, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైమ్‌లో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధిలోకి భారత్‌లో కీలమైన, క్షిపణి ప్రయోగాలను నిర్వహించే తూర్పు తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి. ఈ ద్వీపం నుంచే అగ్ని-5, కే-4 వంటి అధునాతన క్షిపణులను భారత్ పరీక్షిస్తోంది. క్షిపణి వేగం, మార్గం, దూరాలపై కీలమైన డేటాను చైనా సంగ్రహించే అవకాశం ఉంది. భారత దేశ క్షిపణులను కౌంటర్ చేయడానికి చైనా అనుగుణంగా క్షిపణులను రూపొందించే అవకాశం ఉంది.
ఇదే కాకుండా హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతంలోని కీలకమైన వాణిజ్య మార్గాలపై, భారత నావికా దళ ఉనికిని పర్యవేక్షించే అవకాశం ఉంది. చైనాలో ఇప్పటికే బీజింగ్ కోర్లా, జిన్జియాంగ్‌లో LPAR రాడార్లు ఉన్నాయి. ఇవి భారతపై నిఘా కవరేజీని అందిస్తున్నాయి. యునాన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాడార్ భారత్ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై నిఘాను విస్తరిస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!