Shocking: పూణేలో దారుణం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో, పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో, నిలిచి ఉన్న బస్సులో మంగళవారం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు 8 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్‌ని రంగంలోకి దించారు. నిందితుడు 36 ఏళ్ల రాందాస్‌కి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Agra: భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి.. పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేసిన భర్త..
సతారా జిల్లాలోని ఫల్తాన్ అనే గ్రామానికి చెందిన మహిళ, పనిమనిషిగా పనిచేస్తుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నేరం ఉదయం 5.45 నుంచి 6.30 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో మహిళతో ముందుగా నిందితుడు మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆమె గమ్యస్థానాన్ని తెలుసుకున్న నిందితుడు, ఆగి ఉన్న బస్సు వెళ్తుందని అందులోకి వెళ్లాలని సూచించినట్లు బాధితురాలు తెలిపింది. లైట్లు లేకపోవడంతో సందేహించానని, అయితే ప్రయాణికులు నిద్ర పోతుండటంతో లైట్లు ఆర్పేశానని నిందితుడు చెప్పాడని ఆమె తెలిపింది. బస్సులోకి వెళ్లగానే, నిందితుడు డోర్లు మూసేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.
జరిగిన విషయాన్ని, తన స్నేహితురాలికి తెలపడంతో పోలీసుల ఫిర్యాదు చేశారు. ఈ బస్ స్టాండ్ మహారాష్ట్ర ఆర్టీసీ నడిపే అతిపెద్ద బస్ స్టాండ్లలో ఒకటి. దీనిపై ప్రతిపక్షాలు ఫడ్నవీస్ సర్కార్‌పై ఫైర్ అవుతున్నాయి. సీఎంతో పాటు హోంమంత్రిత్వ శాఖను ఫడ్నవీస్ కలిగి ఉన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయని, తాజాగా ఘటన 2012 ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫమైందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆరోపించారు.