UltraTech: దేశంలో అగ్రగామి సిమెంట్ కంపెనీల పేర్ల ఏంటంటే, మొదటగా గుర్తుకు వచ్చేది ‘అల్ట్రాటెక్’. సిమెంట్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే, ఇకపై అల్ట్రాటెక్ అంటే సిమెంట్ మాత్రమే కాదని నిరూపించేందుకు కంపెనీ సమాయత్తం అవుతోంది. కేబుల్స్ అండ్ వైర్స్ వ్యాపారంలోకి అల్ట్రాటెక్ అడుగుపెడుతోంది.
Read Also: Health Tips: రోజుకు ఒక స్పూన్ అవిసె గింజలు తింటే ఆ వ్యాధులకు వణుకే..
రూ. 1800 కోట్లతో రాబోయే రెండేళ్లలో కేబుల్స్ అండ్ వైర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ బోర్డ్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని భరూచ్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్లాంట్ ప్రారంభించే తేదీ డిసెంబర్, 2026గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కస్టమర్లతో తమకు ఉన్న కనెక్షన్‌ని అల్ట్రాటెక్ ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
నిర్మాణ రంగంలో అల్ట్రాటెక్‌ని మరింగా విస్తరించాలని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా లక్ష్యంగా పెట్టుకున్నారు. నివాస, వాణిజ్య, మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియన్ అప్లికేషన్స్, వివిధ రంగాల్లో కేబుల్స్ అండ్ వైర్స్‌కి పెరుగున్న డిమాండ్‌ని తీర్చడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో పాలీక్యాబ్ ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్, హావెల్స్, ఫినోలెక్స్ కేబుల్స్, ఆర్ఆర్ కాబెల్, యూనివర్సల్ కేబుల్స్, పారామౌంట్ కేబుల్స్ ప్రధాన ఆటగాళ్లుగా ఉన్నాయి.