Air Force chief: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్‌కి F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను విక్రయించాలని ఇటీవల ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత, అమెరికా ఇంకా ఈ విమానం కోసం అధికారికంగా ఆఫర్ చేయలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్(ఐఏఎఫ్) ఏపీ సింగ్ అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాక్యలు చేశారు. భారతదేశం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అసవరం ఉందని చెప్పారు. 5వ జనరేషన్ ఫైటర్ జెట్ల కార్యక్రమాన్ని భారత్ వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
Relationship: తమిళనాడులో మహిళ హత్య ఘటన సంచలనంగా మారింది. మహిళతో సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక వ్యక్తి, తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి విషం ఇచ్చి, ఆ తర్వాత లోయలోకి తోసి హత్య చేశారు. రాష్ట్రంలోని సేలం జిల్లాలోని లోయలో 35 ఏళ్ల మృతదేహం కనుగొన్నారు. మృతురాలిని 35 ఏళ్ల లోగనాయగిగా గుర్తించారు.
Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో వైట్ హౌజ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు, సుంకాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. Read Also: Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ […]
Pakistan: పాకిస్తాన్ మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. ఆ దేశంలో 96 శాతం మంది ముస్లింలే, కేవలం 1-2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ విభజన సమయంలో 20 శాతం వరకు ఉన్న హిందువులు, అణిచివేత కారణంగా కేవలం సింగిల్ డిజిట్‌కి పరిమితమయ్యారు. హిందువులపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. బాలికలు, మహిళల్ని బలవంతంగా అపహరించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనికి లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు గురువారం ఇరాన్ నాయకత్వానికి లేఖ పంపారు. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
YouTuber: ప్రముఖ యూట్యూబర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతుల్ని చేశానని చెప్పాడు. 3.41 మిలియన్ సబ్స్క్రైబర్లు కలిగిన 29 ఏళ్ల యూట్యూబర్ నిక్ యార్డీ గత నెలలో తన 22 ఏళ్ల స్నేహితురాలు జాడే, ఆమె తల్లి 44 ఏళ్ల డానిని ఏకకాలంలో గర్భవతుల్ని చేశానని, తన పిల్లలతో గర్భవతులుగా ఉన్నారని ప్రకటించాడు. అయితే, ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది విమర్శలు చేశారు. అయితే, […]
Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రజామోదం రేటింగ్ అమాంతం పెరిగింది. శుక్రవారం ప్రచురించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన అప్రూవల్ రేటింగ్ మరో 10 శాతం పెరిగినట్లు తేలింది.
Jaishankar security breach: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఆయన ఓ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం, కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది. యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ […]
Karnataka Budget: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆర్థిక మంత్రి హోదాలో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ నేత జీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ని ‘‘ముస్లిం లీగ్ బడ్జెట్’’గా అభివర్ణించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ కూడా ఈ బడ్జెట్‌ని తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీల బుజ్జగింపు బడ్జెట్‌గా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.