Crime: బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పాదాల్లో 10 మేకులు పొడిచిన మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నలంద జిల్లాలో గురువారం నాడు పాదాల్లో 10 మేకులు గుచ్చబడిని స్థితిలో మహిళ శవం లభ్యమైంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జిల్లాలోని చండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్‌ని ఆదా చేయాలని చూస్తోంది.
Ranya Rao: కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డీజీపీ, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కె రామచంద్రరావు కుమార్తె కావడంతో ఈ వ్యవహారం మరింతగా వార్తల్లో నిలిచింది. తన కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక అధికారిగా కాకుండా ‘‘గుండె పగిలిన తండ్రి’’గా మాట్లాడుతూ, […]
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం ఎదురైంది. ఖలిస్తానీ అనుకూల వర్గాలు జైశంకర్ వైపు దూసుకు రావడం సంచలనంగా మారింది. బుధవారం రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మిస్టర్ జైశంకర్ చాథమ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక ఖలిస్తానీ అనుకూల నిరసనకారుడు బారికేడ్లను దాటి, జైశంకర్ వైపుగా వచ్చి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
Supreme Court: గత కొంత కాలంగా జాతీయ విద్యా విధానం(NEP), ‘‘త్రి భాష విధానం’’పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదమే చెలరేగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే పార్టీతో పాటు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము ‘‘తమిళ్, ఇంగ్లీష్ ద్వి భాష విధానాన్ని’’ అమలు చేస్తామని చెబుతున్నారు.
Indians In US: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయులను కూడా బహిష్కరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికాలోని వేలాది మంది భారతీయులు H-4 వీసా కింద మైనర్లుగా వలస వెళ్లారు.
Ukraine: అమెరికా, ఉక్రెయిన్ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించడంలో మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రాణాని భారత్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి. అయితే, పాక్-అమెరికన్ పౌరుడైన తహవ్వూర్ రాణా మరోసారి అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీంతో భారత్‌కి అప్పగింత ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
Shocking News: తన మాట వినడం లేదని 5 ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్‌లో జరిగింది. పొరుగింటికి పదే పదే వెళ్తుందనే కోపంతో బాలిక గొంతు నులిమి, నాలుగు ముక్కలుగా నరికి హత్య చేశాడు. నిందితుడు మోహిత్ తన పొరుగింటి వారైన రాము కుటుంబంతో గొడవపడుతున్నాడు. తనతో విరోధం ఉన్న పొరుగింటికి తన కుమార్తె వెళ్తుందనే ఒకే ఒక్క కారణంతో హత్యకు పాల్పడ్డాడు.
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.