Fighter Jet Crash: భారత వైమానిక దళం (IAF)కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ శుక్రవారం కుప్పకూలింది. హర్యానాలోని అంబాలాలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని ఐఏఎఫ్ తెలిపింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది
Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ఈ మతఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా, వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. షేక్ హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి, ర్యాలీలు తీస్తున్నాయి.
Infosys: కోవిడ్ మహమ్మారి కాలంలో, టెక్ కంపెనీలతో పాటు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానం ద్వారా పనిచేయించుకున్నాయి. అయితే, మహమ్మారి తగ్గి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రారావు కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్‌ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్…
China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్‌తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్‌కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్‌ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు.
Justin Trudeau: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన చివరి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 9 ఏళ్ల పదవీకాలంలో గందరగోళ క్షణాలను, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన భారీ సుంకాలను చర్చిస్తూ కంట తడి పెట్టారు. ప్రజాదరణ రేటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో ట్రూడో జనవరిలో తాను ప్రధాని పదవికి, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్లకు మొదటి ప్రాధాన్యం ఉండాలనే తన నిబద్ధతను చెప్పారు.
Wife harassment: భార్య, భార్య తరుపు బంధువులు వేధింపులతో ఇటీవల కాలంలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనంగా మారింది. తన కంపెనీ వెబ్సైట్లో తన భార్య, అత్తలను నిందిస్తూ ఆయన సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్ గదిలో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి ఆత్మహత్య చేసుకున్నాడు. గత శుక్రవారం సహారా హోటల్లోని తన గదిలో ఉరివేసుకుని మరణించాడు.
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
UP Police: హోలీ పండగ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ ఒకే రోజు కలిసి రావడంతో మతపరమైన సున్నిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. గతేడాది నవంబర్ నెలలో సంభాల్ జామా మసీదు సర్వే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించడంతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి