Ranya Rao Case: బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనల్లో ఏకీభవించారు.
Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
Tata Tiago NRG: సేఫ్టీ కార్ల విషయంలో టాటాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాటా నుంచి వచ్చే కార్లు దాదాపుగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సేఫ్టీని సాధిస్తుంటాయి. టాటా హ్యాక్ బ్యాక్ కార్లు కూడా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా టియాగో NRG-2025 మార్కెట్లోకి రాబోతోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు SUV లాంటి స్టైలింగ్ లక్షణాలతో […]
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Breaking News: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది.
Pakistan train hijack: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మనం చాలా సార్లు విమానాలు, ఓడలు, బస్సులు హైజాక్ కావడాన్ని చూశాం. అయితే, రైలును హైజాక్ చేయడం అనేది చాలా కఠినం, అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ వెళ్తున్న రైలును హైజాక్ చేశారు.
Gaza: పాలస్తీనియన్లను గాజా నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్, అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆఫ్రికా దేశాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మూడు ఆఫ్రికా దేశాల్లో వీరికి పునరావాసం కల్పించడానికి చర్చిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ యూఎస్, ఇజ్రాయిల్ అధికారుల్ని ఉటంకిస్తూ నివేదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సుడాన్, సోమాలియా, సోమాలిలాండ్‌తో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు.
Tamil Nadu assembly: ‘‘హిందీ వివాదం’’, ‘‘డీలిమిటేషన్’’, ‘‘రూపాయి సింబర్ మార్పు’’ వివాదాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, సమావేశాల జరుగుతున్న సమయంలో సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వ రూపాయి చిహ్నాన్ని మార్చడం, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో అవినీతిని ఆరోపిస్తూ రెండు పార్టీల ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
Donald Trump: తనకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కిమ్‌తో చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను మరోసారి ‘అణుశక్తి’ గా ట్రంప్ పేర్కొన్నారు. కిమ్‌తో సంబంధాలు తిరిగి స్థాపించుకునే ప్రణాళిక ఉందా..?
Honeytrap: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఫ్యాక్టరీకి చెందిన సున్నిత వివరాలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘హానీ ట్రాప్’’లో చిక్కుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్‌తో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసింది.