Venu Goapl Reddy
Author- NTV Telugu-
Delhi Car blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్‌తో జైషే మహ్మద్‌కు సంబంధం.?
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకొట కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యాందాయ్ i20లో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనకు పుల్వామా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మధ్య సంబంధాలు బయటపడినట్లు పోలీసు వర్గాలు మంగళవారం తెలిపాయి. -
JNUSU: జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి అఖండ విజయం..
JNUSU: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) ల సంకీర్ణమైన లెఫ్ట్ యూనిటీ అలయన్స్ అఖండ విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్ని కైవసం చేసుకుంది. క్యాంపస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. -
Bihar Election 2025: బీహార్ తొలి విడతలో 64 శాతం ఓటింగ్.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం..
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది. -
H-1B Visa: అమెరికా వద్దంటుందా..? మేమున్నాం అంటూ కెనడా ఆహ్వానం..
H-1B Visa: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది. -
Amit Shah: ‘‘ఆర్మీపై వ్యాఖ్యలకు సిగ్గుపడు రాహుల్ గాంధీ’’..
Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Gang Rape: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌కు రప్పించి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..
Gang Rape: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, ఓ మైనర్ బాలికకు నరకంలా మారింది. ఫ్రెండ్‌గా పరిచమైన వ్యక్తి మాయమాటలతో హోటల్‌కు రప్పించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. -
West Bengal: చెరువులో వందలాది ఆధార్ కార్డులు.. “సర్” సమయంలో బెంగాల్లో వివాదం..
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి. -
Jaish-e-Mohammad: జైషే “మహిళా జిహాదీ” యూనిట్ ప్రారంభం.. బాధ్యతలు చేపట్టిన మసూద్ అజార్ సోదరి..
Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది. -
POK: పీఓకేలో తిరుగుబాటు.? పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జెన్-Z నిరసనలు..
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. -
Happiest City: ఆసియాలో “అత్యంత సంతోషకరమైన నగరం”గా ఇండియన్ సిటీ..
Happiest City: ఆసియాలో ‘‘అత్యంత సంతోషకరమైన నగరం’’గా భారతీయ నగరం నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై 2025గానూ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పట్టణవాసులు తమ పరిసరాలు, జీవనశైలి, సమాజాల గురించి ఎలా భావిస్తున్నారో అంచనా వేయడానికి ప్రధాన నగరాల్లో 18,000 మందికి పైగా నివాసితులను వార్షిక సర్వే పోల్ చేసింది. కల్చర్, ఆహారం, నైట్ లైఫ్, జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా సర్వేలో పాల్గొన్న వారు తమ నగరాలకు రేటింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?