Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..
- పోలీస్ అధికారిపై లాలూ కొడుకు జులుం..
- హోలీలో పాటకు డ్యాన్స్ చేయాలని ఒత్తిడి..
- లేకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరింపు..
- ఆర్జేడీపై అధికార జేడీయూ, బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆర్జేడీ నేత తన మద్దతుదారులతో హోలీని జరుపుకుంటున్న సమయంలో, యూనిఫాంలో ఉన్న ఒక పోలీస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన చర్యలపై అధికార జేడీయూ, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
యూనిఫాంలో ఉన్న పోలీస్‌ని పాటకు డ్యాన్స్ చేయాలని ఆదేశించాడు. నిరాకరిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించాడు. ‘‘ నేను పాట ప్లే చేస్తాను, నువ్వు డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేయకుంటే, నిన్ను సస్పెండ్ చేయవచ్చు. బాధపడుకు, ఇది హోలీ’’ అని తేజ్ ప్రతాప్ హెచ్చరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ, జేడీయూ పార్టీలు ఈ వివాదంపై ప్రతిపక్ష ఆర్జేడీ, లాలూ ప్రసాద్‌పై విరుచుకుపడ్డాయి.
Also Read
Read Also: Pakistan: పాక్‌లో వరస దాడులు.. బలూచిస్తాన్‌లో ఆర్మీ కన్వాయ్‌పై ఎటాక్..
‘‘తండ్రిలాగే కొడుకు కూడా. మొదటి తండ్రి(లాలూ) సీఎంగా ఉన్నప్పుడు చట్టాన్ని తన పాటకు డ్యాన్స్ చేయించాడు. బీహార్‌ని జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కొడుకు అధికారం లేనప్పటికీ బెదిరింపులు, ఒత్తిడి ద్వారా చట్టాన్ని అమలు చేసే అధికారులను డ్యాన్స్ చేయమని ఆదేశిస్తు్న్నాడు. డ్యాన్స్ చేయకుంటే సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఆర్జేడీ జంగిల్ రాజ్‌ని నమ్ముతుంది. వారు పొరపాటున అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉల్లంఘించి, తమ సంరక్షకులను డ్యాన్స్ చేయిస్తారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. కాబట్టి వీరిని అధికారానికి దూరంగా ఉంచండి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ తీరుపై ఘాటుగా స్పందించారు. ‘‘ జంగిల్ రాజ్ ముగిసింది. కానీ లాలూ కుమారుడు యువరాజు ఒక పోలీసుని డ్యాన్స్ చేయాలని బలవంతం చేస్తూ, చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నాడు. తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అయినా, లేదా లాలూ కుటుంబంలో ఎవరైనా, మార్పు దిశలో ఉన్న బీహార్‌లో ఇలాంటి వాతావరణానికి స్థానం లేదని గుర్తించాలి’’ అని అన్నారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
RJD = JUNGLE RAJ AND VARDI KA APMAAN
TEJ PRATAP YADAV TO COP- TUMKO THUMKA LAGANA HAI.. NAHI LAGAOGE TOH SUSPEND KAR DIYE JAOGE
This is why they need to be kept out of power! Imagine if this is what they do out of power- what they will do in power.. pic.twitter.com/V0xA67R0iz
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) March 15, 2025
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?