Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
- నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
- ఔరంగజేబు సమాధి వివాదంతో ఇటీవల అల్లర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur riots: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో, నాగ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కొందరు ముస్లిం మూక దాడులకు పాల్పడింది. అయితే, ఈ అల్లర్లకు సంబంధించి కీలక సూత్రధారి ఫహీమ్ ఖాన్‌ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడైన ఇతడిని శుక్రవారం వరకు కస్టడీక పంపారు. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 60 మందిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో పోలీసులు.. ఈ హింసకు కారణం ఒక వ్యక్తి లేదా సంస్థ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. 1200 మందిపై ఫిర్యాదులు అందాయి. వీరిలో ఇప్పటి వరకు 200 కంటే తక్కువ మంది పేర్లు నమోదయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పవిత్ర వ్యాఖ్యలు కలిగిన వస్త్రాన్ని తగలబెట్టారనే పుకార్లు రావడంతో, నమాజ్ ముగిసిన తర్వాత 250 మంది నినాదాలు చేస్తూ అల్లర్లను ప్రారంభించారు. ప్రజల వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు, స్థానికులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం మాట్లాడుతూ.. ఈ హింస ‘‘ముందస్తు కుట్ర’’గా అభివర్ణించారు. ఒక వర్గం వారి ఆస్తులు, ఇళ్లను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ‘‘ఛావా’’ సినిమా తర్వాత శంభాజీ మహరాజ్, మొఘల్ పాలకుల మధ్య వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సినిమా తర్వాత మహారాష్ట్ర అంతటా భావోద్వేగాలు పెళ్లుబికాయి. దీంతోనే ఔరంగజేబు మసీదుని తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?