Trump World Center: భారతదేశంలో మొట్టమొదటి ట్రంప్ బ్రాండెడ్ ఆఫీస్ ‘‘ట్రంప్ వరల్డ్ సెంటర్’’ పూణేలో నిర్మించబోతున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రాపర్టీ డెవలప్మెంట్ పార్ట్‌నల్ అయిన ట్రిబెకా డెవలపర్స్ బుధవారం దేశంలో తొలి ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. $289 మిలియన్లకు పైగా అమ్మకాలను లక్ష్యంగా చేసుకుని దీనిని ప్రారంభించారు.
Read Also: Tesla Cars: “టెస్లా” లక్ష్యంగా అమెరికాలో దాడులు.. లాస్ వేగాస్‌లో కార్లకు నిప్పు..
గత దశాబ్ధంలో కాలంలో అమెరికా వెలుపల, ట్రంప్ బ్రాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కి భారత్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారింది. దేశంలో ట్రిబెకా ఇతర స్థానిక డెవలపర్లతో కలిసి లైసెన్సింగ్ ఒప్పందాల కింద 4 భారతీయ నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం ‘‘ట్రంప్ వరల్డ్ సెంటర్’’గా పిలిచే ఈ ప్రాజెక్టు, పూణే నగరంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ కుందన్ స్పేసెస్ సహకారంతో డెవలప్ చేయనున్నారు. గత దశాబ్ధకాలంలో ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కంపెనీలు, స్థానిక ఐటీ సంస్థలు ఇక్కడ ఆఫీసుల్ని ఏర్పాటు చేశాయి.
ఈ ప్రాజెక్టును దాదాపు నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా ముంబైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయిటర్స్‌తో అన్నారు. రాబోయే 4-6 వారల్లో ఉత్తర, దక్షిణ భారతదేశంలో ట్రంప్ బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను కూడా తమ కంపెనీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. బుధవారం ప్రారంభించిన ఆఫీస్ ప్రాజెక్ట్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం అమ్మకాల సామర్థ్యం $1.15 బిలియన్లుగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.