Jnanpith Award: ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు శనివారం భారతదేశపు అత్యున్నత సాహిత్య గౌరవం ‘‘జ్ఞానపీఠ్ అవార్డు’’కు ఎంపికయ్యారు. 59వ జ్ఞానపీఠ్ అవార్డు శుక్లాని వరించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తొలిసారిగా ఈ అవార్డునను అందుకున్న వ్యక్తిగా నిలిచారు. 88 ఏళ్ల శుక్లా కథా రచయిత, కవి, వ్యాసకర్తగా ప్రసిద్ధి చెందారు. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయితగా శుక్లా నిలిచారు. ఈ అవార్డుతో పాటు రూ. 11 లక్షల నగదు బహుమతి, సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రాన్ని ఇస్తారు.
Read Also: SJ Suryah: ఆరోజే సూసైడ్ చేసుకునే వాడిని.. ఎస్జే సూర్య షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ కథకురాలు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నునంచి ఈ అవార్డు అందుకున్న మొదటి రచయిత వినోద్ కుమార్ శుక్లా. హిందీ సాహిత్యం, సృజనాత్మక, విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అత్యుత్తమ కృషికి ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తున్నాము’’ అని కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. విలక్షణమైన భాషా నిర్మాణం, భావోద్వేగ రచనలకు పేరుగాంచిన శుక్లా 1999లో తన ‘‘దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతి థి’’ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1961లో స్థాపించబడిన జ్ఞానపీఠ్ అవార్డును మొదట మలయాళ కవి జి. శంకర కురుప్‌కు 1965లో “ఓడక్కుళల్” అనే కవితా సంకలనం కోసం ఇచ్చారు.