India GDP: రికార్డ్ క్రియేట్ చేసిన భారత్ జీడీపీ.. 2027 నాటికి జపాన్, జర్మనీ మన వెనకే..
- రికార్డ్ క్రియేట్ చేసిన భారత్..
- 10 ఏళ్లలో డబుల్ అయిన ఎకానమీ..
- 2025లో జపాన్, 2027లో జర్మనీని క్రాస్ చేయనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India GDP: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా పరుగులు తీస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత జీడీపి ఏకంగా 105 శాతం పెరిగింది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు రెట్టింపు అయింది. ఇలాంటి రికార్డ్ ఏ దేశానికి కూడా లేదు. కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ డబుల్ అయింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) డేటా ప్రకారం.. భారతదేశం దశాబ్దంలో 77 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఈ వేగవంతమైన పురోగతి భారత్‌ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసింది. ఇదే వేగంతో కొనసాగితే 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలను అధిగమిస్తే అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, చైనా కూడా ఇదే కాలానికి 74 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. 2015లో $11.2 ట్రిలియన్ల నుండి 2025లో $19.5 ట్రిలియన్లకు పెరిగింది. మరోవైపు, యూరప్ దేశాలు జీడీపీ వృద్ధిరేటులో పడిపోయాయి. 2015-2025 కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వృద్ధి రేటు కేవలం 6 నుంచి 14 శాతమే ఉంది. కోవిడ్ పరిణామాలు, ఉక్రెయిన్ యుద్ధం వంటికి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రస్తుతం భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే, అమెరికా ($30.3 ట్రిలియన్), చైనా ($19.5 ట్రిలియన్), జర్మనీ ($4.9 ట్రిలియన్) ,జపాన్ ($4.4 ట్రిలియన్) ముందు స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!