Family Dispute: భర్త నాలుకను కొరికేసిన భార్య.. ఆత్మహత్య యత్నం..
- భర్త నాలుకని కొరికేసిన భార్య..
- సగం వరకు నాలుక కోల్పోయిన భర్త..
- కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.
అసిస్టెంట్ ఎస్ఐ బ్రిజ్ రాజ్ సింగ్ ప్రకారం.. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ సైన్(25)కి సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. అయితే, అప్పటి నుంచి ఈ జంట మధ్య తగదాలు జరుగుతున్నాయి. తరుచుగా వీరిద్దరూ గొడవ పడేవారు. గురువారం రాత్రి కూడా గొడవకు దిగారు. సరదు మహిళ కోపంతో కన్హయ్య లాల్ నాలుకలో కొంత భాగాన్ని కొరికినట్లు పోలీసులు చెప్పారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
కుటుంబీకులు కన్హయ్యని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని ఝలావర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నారు. నాలుకను తిరిగి కట్టవచ్చని వైద్యులు తమకు తెలియజేశారని కుటుంబీకులు చెప్పారు. మణికట్టు కోసుకున్న భార్యని బలవంతంగా గది నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై కన్హయ్య సోదరుడు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 115(2) మరియు 118(2) కింద స్వచ్ఛందంగా గాయపరచడం మరియు తీవ్రమైన గాయాలు కలిగించినందుకు రవినా సైన్ (23) పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..