Pune: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కారణంగా మూడున్నరేళ్ల కొడుకు అన్యాయంగా బలయ్యాడు. పూణేకు చెందిన 38 ఏళ్ల టెక్కీ తన కొడుకు గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత, నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు.
హిమ్మత్ మాధవ్ తికేటి, మాధవ్ తికేటికి, ఆయన భార్య స్వరూపల చిన్న కుమారుడు. ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మాధవ్, స్వరూపను అనుమానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం, అనుమానంతో ఉన్న మాధవ్ తన చిన్న కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు బార్‌కి వెళ్లాడు, అక్కడ నుంచి సూపర్ మార్కెట్‌కి, ఆ తర్వాత చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
Read Also: KKRvsRCB: 16 ఏళ్ల క్రితం కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్.. ఏ టీం గెలిచిందంటే?
సమయం గడిచిన కొద్ది ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో స్వరూప, తన భర్త, కొడుకు కనిపించడం లేదని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధవ్ చివరిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన కొడుకుతో కనిపించాడు. కానీ ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ఫుటేజీలో అతడు ఒంటరిగా బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు కనిపించాడు.
మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడిని ఓ లాడ్జిలో పట్టుకున్నారు. తాగి మత్తులో ఉన్న మాధవ్, స్పృహ లోకి వచ్చిన తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. సంఘటనా స్థలంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. గొంతు కోసం హత్య చేసినట్లు తెలిసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.