India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్‌కి షాక్‌లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్, […]
Cabinet decisions: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. బుధవారం కేంద్రం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.
PM Modi: మే 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగి రష్యా ‘‘విక్టరీ డే’’ వేడులకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి బుధవారం రాయిటర్స్‌తో చెప్పారు. ప్రధాని మోడీ నిర్ణయం వెనక కారణాలను రష్యన్ అధికారులు పేర్కొననప్పటికీ, పహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Chinmoy Krishna Das: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇస్కాన్ మాజీ నాయాకుడు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ ప్రతినిధి అయిన దాస్‌ని నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే కారణంగా అతడిపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనకు జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ […]
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.
National Security Advisory Board: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘జాతీయ భద్రతా సలహా బోర్డు’’(National Security Advisory Board)ని పునరుద్ధరించింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అలోక్ జోషి దీనికి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గూఢచార సంస్థ ‘‘రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AW’’ కి గతంలో జోషి చీఫ్‌గా పనిచేశారు. సాయుధ దళాలు, పోలీస్ సర్వీస్, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అయిన అధికారులతో కూడి ఏడుగురు సభ్యులు బోర్డుకు నాయకత్వం వహిస్తారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. మంగళవారం, ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన అత్యున్నత సమావేశంలో, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, […]