PM Modi: మే 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగి రష్యా ‘‘విక్టరీ డే’’ వేడులకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి బుధవారం రాయిటర్స్‌తో చెప్పారు. ప్రధాని మోడీ నిర్ణయం వెనక కారణాలను రష్యన్ అధికారులు పేర్కొననప్పటికీ, పహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Hafiz Saeed: మోస్ట్ వాంటెడ్ హఫీస్ సయీద్‌కి పాక్ భారీ భద్రత.. లాహోర్‌లో నిర్భయంగా..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వేడుకలకు భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించవచ్చని తెలుస్తోంది. 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా మోడీ రష్యా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామం గురించి భారత్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించిన రష్యా, విజయానికి 80వ వార్షికోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సహా అనేక మంది అంతర్జాతీయ నాయకులు రష్యాకు వస్తారని భావిస్తున్నారు. 1945లో నాజీ జర్మనీపై రష్యా, మిత్ర పక్షాల విజయానికి గుర్తుగా ‘‘విక్టరీ డే’’ని జరుపుకుంటారు. ప్రధాని మోడీ చివరిసారిగా జూలై 2024లో రష్యా పర్యటనకు వెళ్లారు.