‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు యెల్డండి, తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma) తో మరోసారి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే వెరైటీ లుక్‌లో పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్‌ల్లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ ప్రేమలో ఉందా? నెట్టింట వైరల్ అవుతున్న ప్రైవెట్ ఫోటో
ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అది కూడా రాజశేఖర్ ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే, స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టి-సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. రాజశేఖర్ వంటి సీనియర్ హీరో తోడవ్వడంతో ఈ సినిమాకు మరింత వెయిట్ పెరిగినట్లయ్యింది. త్వరలోనే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.