అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమైన ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి కీలకమైన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో అఖిల్ తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
Also Read : Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!
ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపధ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో కథానాయికగా నటిస్తుండగా, అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం టీమ్ ఒకవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుతోంది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా ధీమాగా ఉన్నారట. మరి ఈ రాయలసీమ కథతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.