Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద చర్యలకు గట్టిగా సమాధానమిస్తున్నామని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమని అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ‘‘ వాళ్ల ఇంట్లోకి దూరి..’’ పీఓకేపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
ఉగ్రవాదులు పిరికి దాడి చేయడం ద్వారా పెద్ద విజయాన్ని సాధించామని భావిస్తే అది పొరపాటే అని, ఇది నరేంద్రమోడీ ప్రభుత్వమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, దాడులకు పాల్పడిన ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశంలోని ప్రతీ అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పమని అన్నారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదని, మొత్తం ప్రపంచం భారత్ వెంట నిలుస్తోందని, పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించబడుతుందని అమిత్ షా అన్నారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "…If someone, by doing a cowardly attack, thinks that it is their big victory, then understand one thing, this is the Narendra Modi government, no one will be spared. It is our resolve to uproot terrorism from every inch of… pic.twitter.com/c4c4FPN17h
— ANI (@ANI) May 1, 2025