India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్ […]
Imran Khan: పాకిస్తాన్ మాజీ సీఎం, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాల జైలులో వేసింది. ఇటీవల, ఆయన మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు.
Operation Sindoor: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పూణేలో మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ పూర్తి ఓటమిని చవిచూసిందని అన్నారు. 7
Vijay Diwas: 1971, డిసెంబర్ 16న పాకిస్తాన్‌పై భారత్ అఖండ విజయం సాధించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. తూర్పు పాకిస్తాన్‌గా పిలుబడుతున్న నేటి బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ అకృత్యాలు, అత్యాచారాలను ఎదురించి, పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులతో అప్పటి పాక్ కమాండర్ నియాజీ భారత్ సైన్యం ముందు లొంగిపోయారు. అయితే, ఆ యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వం చురుకైన పాత్రను పోషించింది. కానీ, యాహ్యా ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం ఓటమి అంచులో […]
Vijay Diwas: డిసెంబర్ 16, 1971న దాయాది దేశం పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లింది. తమను రక్షించాలని ప్రాధేయపడింది. పాకిస్తాన్ నుంచి కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఈ యుద్ధం పాకిస్తాన్ భూభాగాన్ని సగం చేసింది. ఏకంగా 90,000 మంది పాకిస్తాన్ సైనికులతో పాటు పాక్ తూర్పు కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత్ ముందు లొంగిపోతూ, లొంగుబాటు పత్రంపై సంతకం చేశాడు. భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, బంగ్లాదేశ్ […]
Rahul Gandhi: ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు.
Messi row: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్‌కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Dhurandhar: రణ్వీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, దానికి ఉగ్రవాదులు, పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలను గురించి స్పష్టంగా చూపించింది.
Sydney Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్ మారణహోమంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు యూదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఉగ్రవాదుల్ని సాజిద్ అక్రమ్(50), ఇతని కుమారుడు నవీద్ అక్రమ్(24)లుగా గుర్తించారు
Nitin Nabin: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు.