Rabies: ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ లోని ఒక గ్రామంలో ‘‘రేబిస్’’ కలకలం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల, రేబిస్ సోకిన ఒక ఆవు పాలతో ‘పంచామృతం’ ప్రసాదాన్ని చేశారు. ఆవు పచ్చిపాలతో దీనిని తయారు చేయడంతో ఇప్పుడు దీనిని సేవించిన గ్రామస్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు.
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయం, సమానంగా, సమతుల్యంగా జరిగిన తర్వాత మీరు తర్వాత శుభవార్త వింటారు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ నిర్వహించిన ఇండో-అమెరికా ఆర్థిక సదస్సులో ఆయన […]
PM Modi: భారతీయ కళలు, సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. దీంతో పాటు మేకిన్ ఇండియా ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేస్తుంటారు. భారతీయులు, దేశంలోనే తయారయ్యే వస్తువుల్ని కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మోడీ ధరించిన ‘‘వాచ్’’పై అందరి దృష్టి నెలకొంది. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ మోడీ చేతికి కనిపించింది. దీని పేరు ‘‘రోమన్ బాఘ్’’. ఈ వాచ్లో 1947లో విడుదలైన ఒక […]
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 స్థానాలు ఉన్న బీహార్లో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్ జేడీయూ 85 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ‘‘మహాఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలే దక్కించుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇదిలా ఉంటే, నవంబర్ 20న మరోసారి నితీష్ కుమార్ సీఎంగా […]
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మా
Sheikh Hasina: బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని చెబుతూ కేసులు నమోదు చేసింది. గతేడాది జరిగిన విద్యార్థులు హింసాత్మక నిరసనల్లో, షేక్ హసీనా బలవంతంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని, బలప్రయోగం ద్వారా పలువురి మరణాలకు కారణమైందని చెబుతూ, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్షను విధించింది. ఐదు ఆరోపణలపై హసీనాను దోషిగా తేల్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ,హెలికాప్టర్లు, డ్రోన్లు, […]
Ex-Girlfriend: పెళ్లయిన వ్యక్తి, తన ఎక్స్- గర్ల్ఫ్రెండ్కు ముద్దు ఇవ్వాలని చూశారు. బలవంతంగా ‘‘కిస్’’ చేయాలని చూసిన ఆ వ్యక్తిని తగిన గుణపాఠం చెప్పింది. ముద్దు పెట్టుకోవాలని చూసిన వ్యక్తి, నాలుకను కొరికింది. దీంతో, నాలుక కొంత భాగం కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. లైంగికంగా వేధించడం, కిస్ చేయడానికి ప్రయత్నించడంతో సదరు మహిళ, ఆ వ్యక్తి నాలుకను రెండుగా ముక్కలయ్యేలా కొరికింది. Read Also: Kanpur Scam: కోట్లు దోచుకున్న […]
Madvi Hidma: మోస్ట్ వాంటెండ్ మావోయిస్ట్ మడావి హిడ్మా హతమయ్యాడు. నవంబర్ 30లోపు హిడ్మాను హతమారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంతో శపథం చేశారు. గడువుకు 12 రోజుల ముందే హిడ్మా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ట్రై-జంక్షన్లోని దట్టమైన పుల్లగండి అడవులలో జరిగిన భీకర ఎన్కౌంటర్లలో హిడ్మాను భద్రతా దళాలు హతమార్చాయి.