Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Madras High Court: నిందితులు పదే పదే కస్టడీలో జారిపడి గాయాలపాలవుతున్నారనే పోలీసులు వాదనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తీరును ప్రశ్నించింది. తన కుమారుడు జాకీర్ హుస్సేన్‌కు సరైన వైద్య చికిత్స కోరుతూ కాంచీపురానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, వి లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం విచారించింది.
Covid-19: కొన్నాళ్లుగా సద్దుమణిగి ఉన్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లో వేల సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా అంతటా కొత్త కోవిడ్-19 వేవ్ వ్యాపిస్తోంది. కే
Software Job: మన సమాజంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఓ మోజు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటేనే ఊళ్లలో, బంధువుల్లో గౌరవం. చివరకు వివాహం సంబంధాల్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అంటేనే ముద్దు. ఇలాంటి పరిస్థితుల్లో, యువత ఐటీ జాబ్ సంపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కొడుకు హైదరాబాద్, బెంగళూర్ లేదా వీలైతే విదేశాల్లో ఐటీ జాబ్ చేయాలనే కలలు కంటున్నారు. ఈ ఆశల్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట చాలా […]
India Turkey: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌ని సహకరించిన టర్కీకి భారత్, భారత ప్రజలు షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే, టర్కీ ఆపిల్స్‌కి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్, ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ ఆపిల్స్‌ని బ్యాన్ చేశారు. మరోవైపు, టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.
Turkey: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కి టర్కీ సహాయం చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లను పంపించింది. దీంతో పాటు వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పంపించినట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యాప్తంగా టర్కీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే, పూణేకి చెందిన ఆపిల్ వ్యాపారులు టర్కీ ఆపిల్స్‌పై బ్యాన్ విధించారు. మరోవైపు, భారత్ నుంచి టర్కీకి పర్యాటకం కోసం వెళ్లే వారు తమ ట్రిప్ రద్దు చేసుకుంటున్నారు.
Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్‌కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్‌పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ సలహా తీసుకోలేదు’’ అని అన్నారు.