Supreme Court: 1995 చట్టంలోని ఏవైనా నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన ఏ పిటిషన్‌ని కూడా స్వీకరించబోమని, వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలును తాత్కాలికంగా నిలుపుదల కోరుతూ నమోదైన పిటిషన్లను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై నేతృత్వంలోని డివిజన్ బెంచ్, చట్టంలోని మూడు వివాదాస్పద అంశాలపై మధ్యంతర ఉత్తర్వు అవసరమా..? కాదా..? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. Read Also: Shhyamali […]
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్లో ఎన్కౌంటర్ జరిగింది.
Karnataka: కర్ణాటకలోని బాగల్కోట్లో చిన్న వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
Operation Sindoor: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కి భయపడిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారతదేశం, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ‘‘కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా పాకిస్తాన్ కాల్పులు విరమణ కోసం ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలోగా ఉన్న రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఎలా భయపడిందనే విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
Pakistan: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఘన విజయం సాధించింది. టెర్రర్ క్యాంపులతో పాటు, భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పాకిస్తాన్‌కి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.
India Pakistan: న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకమిషన్ కార్యాలయం వెలుపల కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతదేశం నుంచి అతడిని బహిష్కరించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
BrahMos: ఆపరేషన్ సిందూర్‌లో భారతీయ ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చింది. చైనీస్ మిస్సైల్స్, టర్కీష్ డ్రోన్లను స్వదేశీ తయారీ ఆయుధాలతో మట్టికరిపంచారు. దీంతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు ఈ ఆపరేషన్‌లో చాలా సమర్థంతంగా పనిచేసినట్లు తేలింది.