Covid cases: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు.. పెరుగుతున్న కేసులు..
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..
- కొత్తగా రెండు వేరియంట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
Read Also: Honeytrap: వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు.. వీడియోలు తీసి రూ.50 లక్షలు డిమాండ్..!
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రెండు సబ్ వేరియంట్లను, వేరియంట్స్ అండర్ మానిటరింగ్ (VUMలు)గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్లు కారణం. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ ఇన్ఫెక్షన్లు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూర్‌లో కొవిడ్ సంబంధిత మరణం నమోదైంది. కోవిడ్ సహా ఇతర అనారోగ్యాలతో 84 ఏళ్ల రోగి మరణించాడు. బెంగళూర్‌లో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుత శిశువుకు చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. రాష్ట్రం తన నాల్గవ కోవిడ్-19 మరణం నమోదైంది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 ఏళ్ల వ్యక్తి థానేలో మరణించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం కోవిడ్-19 పరిస్థితిని ఆరోగ్య పరిశోధన విభాగం (డిహెచ్‌ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్‌ఎస్) మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) అధికారులతో సమీక్షించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..