Mangaluru: కర్ణాటక కోస్తా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తతెల్తాయి. బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాత మరో హత్య చోటు చేసుకుంది. వారాల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు జరగడం స్థానికంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, స్థానిక మసీదు కార్యదర్శి అయిన 42 ఏళ్ల ఇంతియాజ్ పట్టపగలు నరికి చంపబడ్డాడు.
Read Also: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టితో త్రిమెన్ కమిటీ భేటీ.. ఉద్యోగుల సమస్యలపై ఆరా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంతియాజ్ తన వాహనం నుంచి ఇసుక దించుతుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై, అతని సహచరుడు కలందర్‌పై కత్తితో దాడి చేశారు. ఇంతియాజ్ అక్కడిక్కడే మరణించగా, కలందర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక కోస్తా ప్రాంతంలో వివాదాస్పద వ్యక్తి సుహాస్ శెట్టి హత్య తర్వాత ఈ హత్య జరిగింది. ఇతడిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థలతో ఇతడికి సంబంధం ఉంది. ఇతడి హత్యతో ఆ ప్రాంతంలో రాజకీయ, మతపరమైర ఉద్రిక్తతల్ని రేకిత్తించింది.