Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్‌కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..
- కేరళ కమ్యూనిటీ కార్యక్రమానికి షాహిద్ అఫ్రిది..
- భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య అఫ్రిదిని స్వాగతించడంపై వివాదం..
- దుబాయ్‌లో కేరళ కార్యక్రమానికి రావడంపై నెటిజన్ల ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: దుబాయ్‌లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ బి.టెక్ పూర్వ విద్యార్థుల సంఘం (CUBAA) గత వారం పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ (PAD)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో CUBAA ఒక ప్రకటన విడుదల చేసింది, పాకిస్తానీ క్రికెటర్లు ఆహ్వానం లేకుండానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, అదే వేదికలో వేరే కార్యక్రమానికి హాజరవుతున్నారని పేర్కొంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. వీడియోలో షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌ని కేరళ కమ్యూనిటీ సాదరంగా ఆహ్వానించడం చూడవచ్చు. అఫ్రిది వేదికపైకి వచ్చినప్పుడు కింద ఉన్న వారు ‘‘ బూమ్ బూమ్’’ అని నినాదాలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా అఫ్రిది ‘‘హోగయా బూమ్ బూమ్’’ అని ప్రతిస్పందించాడు. తాను కేరళ ఫుడ్‌కి పెద్ద అభిమాని అని చెప్పడం వినవచ్చు.
Also Read
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
Read Also: APPSC Scam: ఏపీపీఎస్సీ గ్రూపు 1 కేసు.. రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థ..!
అయితే, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యానించిన అఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని భారత నెటిజన్లు ఎస్ఎంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది సిగ్గులేని తనం’’ అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులపై ఎన్ఐఏ విచారణ జరపాలని, వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని మరొకరు డిమాండ్ చేశారు. భారత్‌పై విషం చిమ్మే ఆఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నిజంగా కేరళ 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రమా..? అని ప్రశ్నిస్తున్నారు.
పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై అఫ్రిది నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కాశ్మీర్లో 8 లక్షల మంది భారత సైన్యం ఉన్న ఉగ్రవాద దాడిని ఆపలేదని, వారంతా అసమర్థులు’’ అంటూ అఫ్రిది భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌పై పాక్ ఆర్మీ విజయం సాధించిందని పెద్ద ఎత్తున విక్టరీ ర్యాలీలు నిర్వహించాడు.
What a shame!! – Desperate Keralites welcome this Anti-India Paki with 'Boom Boom' at an event in Dubai, especially after Pahalgam terror attack and his venomous stand against India pic.twitter.com/F8Fuigxu4s
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 30, 2025
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!