Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా దెబ్బతీసిన ఉక్రెయిన్..
- రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్, దాడితో నివ్వెరపోయిన ప్రపంచం..
- రష్యాలోని పలు వైమానిక స్థావరాలపై డ్రోన్ అటాక్స్..
- 40కి పైగా విమానాలు, వ్యూహాత్మక బాంబర్లు ధ్వంసం..
- 117 డ్రోన్లతో దాడి, 18 నెలల ప్లానింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడితో ప్రపంచమే అబ్బురపడుతోంది. రష్యాలోని సుదూర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మూడేళ్ల యుద్ధంలో ఈ రకంగా రష్యాపై దాడి జరగడం ఇదే తొలిసారి. అణు సామర్థ్యం కలిగిన బాంబర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. 40 కంటే ఎక్కువ రష్యన్ విమానాలు ధ్వంసమైంది. బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. టర్కీలో శాంతి చర్చలు ప్రకటించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఈ దాడిని ‘‘అద్భుతమైన ఆపరేషన్’’ అని పిలిచారు.
Read Also: Anna University Case: అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసు సంచలన తీర్పు..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే, ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ పక్కా ప్లాన్ చేసింది. 117 డ్రోన్లను వినియోగించి విధ్వంసం సృష్టించింది. ఈ దాడి ప్రణాళికకు 18 నెలలు పట్టింది. ఈ విషయాన్ని జెలెన్ స్కీ స్వయంగా ప్రకటించారు. రష్యా నిఘా, భద్రతా సంస్థ అయిన ఎఫ్ఎస్‌బీ స్థానిక ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయం నుంచే ఈ ఆపరేషన్‌ని సమన్వయం చేసినట్లు వెల్లడించారు. 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ధ్వంసం చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. దాదాపుగా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
‘‘ఆపరేషన్ స్పెడర్ వెబ్’’ పేరుతో ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్‌లో ముర్మాన్స్క్, ఇర్కుట్క్స్, ఇవనోవో, రియాజాన్, అముర్ ప్రాంతాల్లోని 5 వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు మాస్కో ధ్రువీకరించింది. ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 4,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్‌లోని బెలాయా ఎయిర్‌బేస్, ఉత్తరాన ఫ్రంట్‌లైన్‌ల నుండి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఓబ్లాస్ట్‌లోని ఒలెన్యా ఎయిర్‌బేస్ ఈ దాడిలో దెబ్బతిన్నాయి. ముందుగా రష్యాలోకి ఉక్రెయిన్ తన డ్రోన్లను అక్రమంగా రవాణా చేసింది. ట్రక్కుల్లో ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల కింద డ్రోన్లను దాచిపెట్టారు. దాడి సమయంలో రిమోట్ సాయంతో పైకప్పు తెరుచుకునేలా చేసి, డ్రోన్ల ద్వారా స్వల్ప దూరంలో ఉన్న ఎయిర్ బేస్‌లపై దాడులు నిర్వహించారు.
Ukrainian "Pavutyna" (spider net) operation is today's attack launched simultaneously on four russia's strategic aviation airbases has reportedly destroyed 40 (forty) strategic bombers on 4 (four) airbases: Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km),… pic.twitter.com/AYr5g7Xr7L
— Sergej Sumlenny, LL.M (@sumlenny) June 1, 2025
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!