Sonam Raghuvanshi: భర్త వెనకాలే నడుస్తూ, వెన్నుపోటు పొడిచిన సోనమ్..
- హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..
- భర్త వెనకాలే నడుస్తూ వెన్నుపోటు..
- అలసిపోయినట్లు నటిస్తూ, చంపేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Raghuvanshi: దేశవ్యాప్తంగా ‘‘హనీమూన్ మర్డర్’’ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లే కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో హతమార్చింది. ఈ కేసు తర్వాత, పెళ్లి అంటేనే మగాళ్లు భయపడేలా చేసింది. ఈ మొత్తం ప్లాన్‌ని సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా రూపొందించారు. ఆమె తన ముగ్గురు స్నేహితుల్ని కాంట్రాక్ట్ కిల్లర్స్‌గా నియమించుకుంది.
రాజా, సోనమ్ వివాహం జరిగిన 5 రోజుల తర్వాత తన చిన్ననాటి స్నేహితులైన ఆనంద్ కుమ్రి (23), ఆకాష్ రాజ్‌పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22) లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక కేఫ్‌కు పిలిచి రాజాను హత్య చేయడానికి ప్లాన్ చేశారు. నేరం చేసేందుకు వీరిని డబ్బుతో ప్రలోభపెట్టారు. మే 20 రాజా, సోనమ్ మేఘాలయలో తమ హనీమూన్ కోసం బయలుదేరారు. వీరిని ముగ్గురు హంతకులు వెంబడించారు. మే 20న సోనమ్ లవర్ రాజ్ తన స్నేహితుల్ని మొదట గౌహతికి పంపించి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో గొడ్డలిని ఆర్డర్ చేసినట్లు తేలింది. అక్కడ నుంచి వారు షిల్లాంగ్‌కి వెళ్లి రాజా, సోనమ్ బస చేసిన హోటల్‌కి సమీపంలో ఉన్నారు.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
Read Also: Raj Kushwaha: నా కొడుకు నిర్దోషి.. ఏ పాపం తెలియదు.. సోనమ్ ప్రియుడి తల్లి ఆవేదన
ఈ జంట మొదటి మూడు రోజులు మేఘాలయ అందాలను వీక్షించారు. అయితే మే 23న ఫోటో షూట్ నెపంలో సోనమ్ కొండల్లోకి ట్రెక్కింగ్‌కి తీసుకెళ్లింది. అదే సమయంలో నిందితులు వీరిని వెంబడించారు. వీరి గురించి తెలియని రాజా వీరితో మాట్లాడుతూ వెళ్లాడు. అయితే, సోనమ్ అలసిపోయినట్లు నటిస్తూ, తన భర్త, హంతకుల వెనకాల చాలా దూరంగా నడుస్తూ వెళ్లింది. నిర్జన ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత సోనమ్ అతడిని చంపండి అంటూ అరిచినట్లు తేలిసింది.
అయితే, ఈ హత్య జరుగుతున్న సమయంలో సోనమ్ ప్రియుడు రాజ్ సీన్‌లో లేడు. అతను మేఘాలయ వెళ్లలేదని పోలీస్ వర్గాలు చెప్పాయి. కానీ, ఈ మొత్తం ప్లాన్‌లో సూత్రధారిగా ఉన్నాడు. ముందుగా ఇదంతా తెలియని కుటుంబీకులు, పోలీసులు ఈ జంట తప్పిపోయిందని వెతకడం ప్రారంభించారు. జూన్ 2న రాజా మృతదేహం అక్కడి లోయలో లభించింది. ఆ తర్వాత హత్యగా తేలింది. పోస్టుమార్టం నివేదికలో అతడిపై రెండుసార్లు దాడి జరిగినట్లు తేలింది. ఒకసారి తల వెనక భాగంలో, మరోసారి ముందు నుంచి దాడి చేశారు.
ఘటన తర్వాత 24 ఏళ్ల సోనమ్ శనివారం రాత్రి ఘాజీపూర్‌లోని ఒక ధాబాలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సోనమ తనను తాను బాధితురాలుగా చూపించే ప్రయత్నం చేసింది. చివరకు మొత్తం ప్లాన్ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!