Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లిన 17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం సుందర్ పహారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుల్లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read Also: Padmanabhaswamy Temple: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘‘మహా కుంభాభిషేకమ్’’..
ఒక పెళ్లికి హాజరుకావడానికి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆమెను పట్టుకుని, ఆమె అరవకుండా నోటి చుట్టూ వస్త్రాన్ని కట్టి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో తనపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక ఆరోపించింది. బాధితురాలి కుటుంబం నిందితులపై కేసు పెట్టింది. 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల కోసం పంపారు.