Venu Goapl Reddy
Author- NTV Telugu-
USA: అమెరికాలో దారుణం… కాల్పుల్లో 10 మంది మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( […] -
Sheikh Mohamed: యూఏఈకి కొత్త అధ్యక్షుడు
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం […] -
Congress: కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం… ఒకరికి రెండు సార్లు మాత్రమే రాజ్యసభ సీటు..!
కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్ […] -
MK Stalin: తమిళనాడు సీఎం మరో సంచలన నిర్ణయం… బస్సుల్లో నిర్భయ స్కీం అమలు
మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇటీవల ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎంకు విన్నవించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీం అమలు చేయనున్నారు. మొదటి దశగా ఐదువందల బస్సుల్లో… తరువాతి దశలో 2500 బస్సుల్లో […] -
Delhi Fire Accident: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. 29 మంది మిస్సింగ్
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు. […] -
Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రలో 31కి చేరిన మృతుల సంఖ్య… మౌంటైన్ సిక్ నెసే కారణం
ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు. మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ […] -
Wheat Export Ban: గోధుమ ఎగుమతులపై కేంద్రం బ్యాన్… ధరలు నియంత్రించేందుకు నిర్ణయం
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. మే 14 నుంచి గోధుమల ఎగుమతులను తక్షణమే నిలపివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఈ ఉత్తర్వుల కన్నా ముందు ఎగుమతుల కోసం అనుమతులు ఉంటే అనుమతించబడుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో […] -
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం… వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. […] -
Sri Lanka Crisis: మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్… అరెస్ట్ చేయాలని కోర్ట్ ఆదేశం
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్ […] -
Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!