Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ దూరంగా ఉండటంపై ఢాకా అసంతృప్తి.
- భారత్‌తో సంబంధాలపై బలుపు మాటలు.
- “ఎప్పుడూ భారత్ గురించే ఆలోచించలేం” అంటూ కీలక వ్యాఖ్యలు.
- షేక్ హసీనా హయాంలో లాగా సంబంధాలు ఉండవని స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బ్రిక్స్ సమావేశాలకు దూరంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తన కోపాన్ని వెలిబుచ్చుతోంది. ఆ దేశ విదేశాంగ సహాయక మంత్రి హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ‘‘మనం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా భారత్ గురించే ఆలోచించలేము. మనం దానిని అధిగమించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంతో తమ సంబంధాలనున పున:ప్రారంభించాలని, కొత్త మార్గాలను నిర్వచించుకోవాలని, గత 15 ఏళ్ల పద్ధతుల్ని అధిగమించాలని కోరుకుంటోందని అన్నారు.
ఆదివారం ఆ దేశ మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకింత అసహనంతో కబీర్ సమాధానాలు చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘మీ ప్రశ్న సరైనది కాదు. భారత్‌పై మీకున్న వ్యామోహాన్ని వదిలేయండి. భారత్ కేవలం మరో పొరుగు దేశం మాత్రమే, దానితో మేము మంచి ద్వైపాక్షిక సంబంధాలు కోరుకుంటున్నాము’’ అని అన్నారు. గత 15 ఏళ్ల పద్ధతుల నుంచి ముందుకు సాగాలని అనుకుంటున్నామని, షేక్ హసీనా హయాంలో ఉన్నట్లు బంగ్లాదేశ్-భారత్ సంబంధాలు కొనసాగయని చెప్పకనే చెప్పారు.
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానికి భారత్ పంపిన ఆహ్వానంపై ఆ దేశం కోపంతో ఉంది. భారత్ బంగ్లాదేశ్ ప్రధానిగా కాకుండా, బిమ్స్టెక్ (BIMSTEC) ఛైర్మన్‌గా తారిఖ్ రెహ్మాన్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం నేరుగా తమ ప్రధానికి పంపలేదని, అందుకే తమ ప్రధాని ఈ సదస్సుకు హాజరుకావడం లేదని బంగ్లాదేశ్ చెబుతోంది.
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!