Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ఏకంగా 82 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఫ్ఘన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ వరుస సిక్సర్లు బాది తన సత్తా చాటాడు.
పిచ్‌పై కుదురుకోవడానికి ఎంతో సమయం తీసుకోకుండా, బంతి పడడమే ఆలస్యం అన్నట్లుగా మైదాన నలుమూలలకూ బంతులను తరలించాడు. 256.25 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. పవర్‌ప్లేలోనే జట్టు స్కోరును అంబరాన్నంటించేలా చేసి, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 13.4 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8 నాటౌట్) రాణించారు. సంజు శాంసన్ (10) త్వరగా అవుటైనప్పటికీ, అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసంతో భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నబీ రెండు వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ ఘన విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ ఆడిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!