Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran: భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సెట్లోకి అడుగుపెట్టి ప్రాజెక్ట్ ఒప్పుకున్న ఏ నటుడైనా.. సినిమా పూర్తయ్యే వరకు బయట మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి సినిమా కోసం ఏళ్లకే ఏళ్లు లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విషయంలో ఒక స్టార్ యాక్టర్ మాత్రం జక్కన్న రూల్ బుక్‌ను తిరగరాశారు. ఆయనే మాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో పృథ్విరాజ్ సుకుమారన్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ చిత్రంలో పృథ్విరాజ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఇక్కడ అసలైన సెన్సేషన్ ఏంటంటే.. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి తన పార్ట్ షూటింగ్ ముగిసే లోపు ఆయన నటుడిగా, దర్శకుడిగా ఏకంగా 9 ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా జక్కన్నతో పనిచేసే నటులు మరొక వైపు కన్నెత్తి కూడా చూడలేరు. అలాంటిది ఇంతటి భారీ ప్రొడక్షన్ షెడ్యూల్స్‌ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, అటు తన రోల్‌ను బ్యాలెన్స్ చేస్తూనే వరుసగా సినిమాలు పట్టాలెక్కించి పూర్తి చేయడం పృథ్విరాజ్ సుకుమారన్ కెరీర్లోనే ఒక అరుదైన రికార్డుగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
పృథ్విరాజ్ సుకుమారన్ పార్ట్ పూర్తి కావడంతో పాటు ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఫైనల్ టచ్ పనుల్లో తలమునకలై ఉంది. కేవలం మరో మూడు వారాల ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని, అది కంప్లీంట్ కాగానే పూర్తిస్థాయి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ ప్రమోషనల్ కంటెంట్‌ను కూడా జక్కన్న టీమ్ రెడీ చేస్తోందట. ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మాధవన్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఇప్పటికే మేకర్స్ డేట్ లాక్ చేశారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!