Arunachal Pradesh: భారత అంతర్భాగమైన ‘‘అరుణాచల్ ప్రదేశ్’’ తమదే అని, అది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు అరుణాచల్ తమ దేశం నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన పెంటగాన్ నివేదికలో, అరుణాచల్ ప్రదేశ్ చైనా ‘ప్రధాన ఆసక్తుల్లో’ ఒకటిని చెప్పింది. అరుణాచల్‌పై చైనా రాజీకి, చర్చలకు సిద్ధంగా లేదని నివేదిక పేర్కొంది. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తైవాన్, దక్షిణ […]
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ .. ‘‘బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని చంపారు. కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు. Read Also: Shivaji Press Meet: నేను ఎవరితోనూ మిస్ […]
Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న సంబంధాలు భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. షేక్ హసీనా గతేడాది పదవీచ్యుతి తర్వాత ఆమె భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మారారు. అప్పటి నుంచి అతను పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్ని రోజులుగా పాకిస్తాన్‌కు చెందిన కీలక సైనికాధికారులు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, ఐఎస్ఐ అధికారులు భారత సరిహద్దుల్లో పర్యటించడం ప్రమాదకరంగా మారింది.
Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది.
Navneet Rana: దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది పిల్లలు ఉన్నారని, వారి జనాభా పెరుగుతూనే ఉందని, దానిని ఎదుర్కొవడానికి, హిందుస్థాన్‌ను రక్షించడానికి హిందువులు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలని ఆమె పిలుపునిచ్చారు.
Pakistan: భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, భారత్‌పై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఇటీవల, రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, బంగ్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా […]
'SIR' In Telangana: కేంద్ర ఎన్నికల సంఘం నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ను ప్రారంభించింది. ఇప్పటికే, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈసీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, యూపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపట్టింది. ముఖ్యంగా, ఈ ప్రక్రియపై బీజేపేతర ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Kerala: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ బఘేల్ కేరళలో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశీగా పొరబడిని […]