ఇండస్ట్రీలో విడాకులు.. బ్రెక్‌అప్‌లు చాలా కామన్. ఎంత క్లోజ్ గా తిరుగుతారో అంతే త్వరగా బందాలకు ముగింపు కూడా పలుకుతారు. ఇందులో మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ జంట ఒకటి. 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం మలైకా అరోరా సొంతం. సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన విడాకులు, రిలేషన్‌షిప్స్‌పై మనసు విప్పి మాట్లాడింది.
Also Read : Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్
‘నేను పెళ్లి చేసుకున్నాను.. విడిపోయాను. ఆ తర్వాత రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనే కాన్సెప్ట్ తప్పని నేను అనుకోను. అవి నాకు సెట్ కాలేదు అంతే! కానీ నాకు ఇప్పటికీ ప్రేమ మీద నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అంటే నాకు చాలా ఇష్టం అదృష్టం ఉండాలి’ అంటూ మలైకా క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో అమ్మయిలకు మలైకా ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది.
‘ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తప్పు చేయకండి. పెళ్లికి ముందే జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆర్థికంగా, మానసికంగా మన కాళ్ళ మీద మనం నిలబడటం నేర్చుకున్నాకే పెళ్లి పీటలు ఎక్కాలి’ అని ఆమె సూచించింది. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన మలైకా, ప్రస్తుతం తాను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నానని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇక ఇటీవల రష్మిక మందన్న నటించిన ‘థమ్మా’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో మెరిసిన మలైకా, ప్రస్తుతం హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తోందంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.