రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయింది ఒక్కటే విషయంలో! టీజర్, ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్‌కు సంబంధించిన సీన్స్ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. దీంతో.. అరె మారుతి ఎందుకిలా చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు అభిమానులు. ఇక ఈ విషయం మారుతి వరకు చేరడంతో.. పెద్దాయనను రెండో రోజు నుంచే థియేటర్లోకి దింపుతున్నామని చెప్పుకొచ్చాడు. రాజాసాబ్ సక్సెస్ మీట్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ సెకండ్ డే ఈవెనింగ్ షోస్ నుంచి యాడ్ అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఆ సీన్స్ 7-8 నిమిషాల వరకు ఉంటాయని స్పష్టం చేశాడు.
Also Read : Ashika Ranganath : ఈ సంక్రాంతికి లక్ పరీక్షించుకుంటున్న కన్నడ క్యూటీ
సినిమాలోని కొన్ని సీన్స్‌ను క్రిస్పీగా చేస్తామని కూడా అన్నాడు. దీంతో మరోసారి రాజాసాబ్‌ను చూసేందుకు రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. నిజానకి ప్రభాస్ ఓల్డ్ లుక్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. నోట్లో చుట్టతో ప్రభాస్ ఆటిట్యూడ్ చూసి థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకొని రియల్ రాజాసాబ్‌ను థియేటర్స్‌లో యాడ్ చేశారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించగా.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్‌తో రొమాన్స్ చేశాడు డార్లింగ్. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఓల్డ్ రాజాసాబ్ కూడా థియేటర్లోకి రావడంతో ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఏదేమైనా.. రాజాసాబ్ మాత్రం ప్రభాస్ కెరీర్లో ఓ కొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు. దర్శకుడు మారుతీ ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాలి.