Venu Goapl Reddy
Author- NTV Telugu-
JP Nadda: కేరళ ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారింది.. మత ఘర్షణలు పెరిగాయి.
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. -
Online Gaming: ఆన్లైన్ గేమింగ్‌పై నిషేధం.. ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్
Tamil Nadu Cabinet approves ordinance to ban online gambling in state: ఆన్లైన్ గేమింగ్ పిల్లలు, యువతపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్ నిషేధించాలని భావిస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం ఆన్లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆర్ధినెన్స్ కు ఆమోదం తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఆర్డినెన్స్ అమలులోకి రానుంది. -
Govt Bans YouTube Videos: భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం.. యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్
Govt bans 45 YouTube videos: భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. దేశంలో అశాంతి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు పాకిస్తాన్ బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న మరికొన్ని ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరో 10 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా “జుట్టు ముడవడమే” తప్పైంది.. కాల్చి చంపిన ఇరాన్
Anti-Hijab Protests in Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇరాన్ దేశాన్ని కుదిపేస్తోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మహ్స అమినిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై […] -
Uttar Pradesh: స్పెల్లింగ్ తప్పు రాశాడని ఉపాధ్యాయుడి దాడి.. దళిత విద్యార్థి మృతి
Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం ఉచ్ఛరించాడని ఓ ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా రాశాడనే కారణంతో ఉన్నత కులానికి చెందిన… -
Russia: పుతిన్‌కు షాక్.. భారీగా నిరసనలు.. దేశం దాటుతున్న యువత
Mass protests in Russia: పాక్షిక సైనిక సమీకరణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశంలో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. బుధవారం రష్యాలో యువత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. పుతిన్ ప్రకటనతో అక్కడి యువత గందరగోళానికి గురువుతోంది. ఉక్రెయిన్ నుంచి ఎదురువుతున్న ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు దాదాపుగా 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. దీంతో పాటు గతంలో మిలిటరీలో పనిచేసిన వారిని, యువతను సమీకరించేందుకు పాక్షిక సైనిక సమీకరణపై ఆదేశాలు జారీ చేశారు. -
PFI targeting RSS leaders: ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన పీఎఫ్ఐ.. నేతల కదలికపై నిఘా
PFI targeting RSS leaders: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) గురించి నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ముస్లిం యువతను అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది పీఎఫ్ఐ. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను, బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్లుగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ వర్గాలు తెలిపాయి. -
JP Nadda: 2024 వరకు అధ్యక్షుడిగా జేపీ నడ్డా.. పొడిగించే ఆలోచనలో బీజేపీ
Extension of JP Nadda's tenure as BJP President: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించే ఆలోచనలో ఉంది బీజేపీ. మరో రెండేళ్లలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అప్పటి వరకు జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంచాలని బీజేపీ భావిస్తోంది. 2024 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. 2020లో అమిత్ షా నుంచి జేపీ నడ్దా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి జనవరి… -
Jharkhand: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.
physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Karnataka: తెలంగాణ సంక్షేమ పథకాలు మాకు కావాలి.. కర్ణాటక రైతుల ఆందోళన
Agitation of Farmers Unions- Demand for implementation of Telangana schemes: తెలంగాణలో అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు మాకు కావాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతులు ఆందోళలు, నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రైతులు భారీ ధర్నా చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసింది. కర్ణాటకలో కూడా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!