Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం
- 27 మంది మృతి
- 63 మంది గాయపడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. నగరంలోని ఒక ప్రముఖ పబ్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో కనీసం 27 మంది మరణించగా, మరో 63 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బ్యాంకాక్ గవర్నర్ వెల్లడించారు.
అధికారుల సమాచారం ప్రకారం, నగర ఉత్తర భాగంలోని పబ్ లో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పలువురు బయటకు పరుగులు తీయగా, మరికొందరు భవనం లోపలే చిక్కుకుపోయారు.
Also Read
- White House Lockdown: ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
- Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
- Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
- Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
ఘటన స్థలాన్ని సందర్శించిన థాయ్ ప్రధానమంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు 27 మంది మరణించారు. గాయపడిన చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో పబ్ ప్రధాన ద్వారం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో లోపల ఉన్న ప్రజలు ప్రాణరక్షణ కోసం పరుగులు తీస్తూ బయటకు వస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
టాయిలెట్లో దాక్కోవడం ప్రాణాంతకంగా మారింది
స్థానిక మీడియా కథనాల ప్రకారం, చాటుచాక్ జిల్లాలోని ‘రోంగ్ బీర్ నా లాట్ ఫ్రావో’ అనే పబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మొదట కాలిన గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినప్పటికీ, అనంతరం భవనం లోపల అనేక మంది చిక్కుకుపోయినట్లు గుర్తించారు. మంటల నుంచి తప్పించుకోవడానికి పలువురు పబ్‌లోని మరుగుదొడ్లలో దాక్కున్నారని సమాచారం. అయితే, దట్టమైన పొగ, వేగంగా వ్యాపించిన మంటల కారణంగా వారు బయటకు రాలేకపోయారు. మృతులలో అధికశాతం మంది టాయిలెట్ ప్రాంతంలోనే లభించినట్లు అధికారులు భావిస్తున్నారు.
30 నిమిషాల పోరాటం తర్వాత మంటలు అదుపులోకి
సంఘటనా స్థలానికి చేరుకున్న అనేక అగ్నిమాపక బృందాలు వాటర్ కెనాన్ల సహాయంతో సుమారు 30 నిమిషాలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం అనంతరం విడుదలైన చిత్రాలలో పబ్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు కనిపించింది. కాలిపోయిన బల్లలు, కుర్చీలు, శిథిలాల మధ్య సహాయక బృందాలు గంటల తరబడి సహాయక చర్యలు నిర్వహించాయి.
అగ్ని భద్రతపై మళ్లీ ప్రశ్నలు
ఈ ఘటనతో థాయ్‌లాండ్‌లోని పబ్ ల భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మంటలు ఇంత వేగంగా ఎందుకు వ్యాపించాయనే అంశంతో పాటు, పబ్‌లో తగిన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022లో తూర్పు థాయ్‌లాండ్‌లోని ఒక మ్యూజిక్ పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 2009లో బ్యాంకాక్‌లోని శాంతికా నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన నైట్‌క్లబ్ ప్రమాదంగా నమోదైంది.
23.57 น. รับแจ้งจากสายด่วน 199 เหตุเพลิงไหม้ภายในร้านอาหาร ใกล้เคียงซอยลาดพร้าว 1 ถนนลาดพร้าว แขวงจอมพล เขตจตุจักร เจ้าหน้าที่สถานีดับเพลิงและกู้ภัยสุทธิสาร กำลังไปที่เกิดเหตุ สถานที่เกิดเหตุ pic.twitter.com/Tw6EPb7fhS
— JS100Radio (@js100radio) July 12, 2026
తాజావార్తలు
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్‌పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
-
IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?